TTDP leader Revanth Reddy reached vijayawada to meet TDP president and CM Chandrababu Naidu.
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో శనివారం మరోసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఆ పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి శనివారం ఉదయమే విజయవాడకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో చంద్రబాబునాయుడుతో రేవంత్ భేటీ కానున్నారు. చంద్రబాబునాయుడు ఇతర తెలంగాణ సీనియర్ నేతలతోనూ విడి విడిగా భేటీ అయ్యే అవకాశం ఉంది.
చంద్రబాబుతో శుక్రవారమే రేవంత్ భేటీ అయినప్పటికీ ఏమీ స్పష్టత రాకపోవడంతో మరోసారి అమరావతిలో భేటీ కావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్‌ల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేవంత్.. టీడీపీలోనే కొనసాగుతారా? చంద్రబాబుకు తన పరిస్థితి వివరించింది కాంగ్రెస్ పార్టీలో చేరతారా? తేలే అవకాశం ఉంది.